లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి – టెక్నాలజీని అభివృద్ధికి ఉపయోగించుకోవాలి – వికే జూనియర్ కళాశాల 45వ వార్షికోత్సవం నిర్వహణ

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎస్సై ప్రేమకుమార్ కోరారు. స్థానిక వి.కే జూనియర్ కళాశాలలో మంగళవారం 45వ వార్షికోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ సి, తారక్ నాథ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్సై ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ..విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చటానికి కష్టపడి చదవాలని కోరారు. టెక్నాలజీని అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని చెడు మార్గాల కోసం అన్వేషించవద్దని అన్నాడు. చెడు మార్గంలో నడుస్తూ మత్తు పానియాలు, డ్రగ్స్ వంటి వాటిని అలవాడు పడినట్లయితే జీవింతం అంధకారం అవుతుందని, సమాజంలో తల్లిదండ్రులకు, తోటి బంధువులకు కూడ తల వంపులు వస్తాయని అన్నారు. మంచి స్నేహాలు చేస్తూ జీవితాన్ని అభివృద్ధి మార్గంలో పయనించుకునేలా మీకు మీరే మార్గదర్శకులు కావాలని కోరారు. ప్రిన్సిపాల్ తారక్ నాథ్ మాట్లాడుతూ కళాశాలలో ప్రభుత్వం నాడు – నేడుతో అనేక సౌకర్యాలు సమకూర్చుతున్నారని, విద్యార్థులు మంచి మార్కులు సాధించినట్లయితే వారిని ఆదర్శంగా తీసుకుని కళాశాలలో నూతన విద్యార్థులు అడ్మిషన్లు పొందుతారని అన్నారు. గత విద్యాసంవత్సరంలో జిల్లాలో ఉత్తమ మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థులకు అభినందించారు. లెక్చరర్స్ అందరూ కూడా అంకిత భావంతో కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న విధానాన్ని వివరించారు. అనంతరం గత విద్యాసంవత్సరంలో ప్రతిభ చాటిన విద్యార్థులకు, పలు పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు పంపిణి చేసారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వి.కె ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అజయ్ బాబు, ఆచార్యులు పాండు రంగ రాజు, ఎం శ్రీధర్, గురవయ్య, పార్వతి బాయ్, నరసింహారావు, అధ్యాపకేతర సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *