వినుకొండ నుండి ఈదర వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆర్టిసి బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు వినుకొండ డిపో మేనేజర్ హనుమంతరావు తెలిపారు…ముఖ్యంగా ఈదర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యం కొరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు… ఇప్పటివరకు కొందరు విద్యార్థులు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారనే విషయాన్ని కొందరు ముండ్లమూరు మండల ప్రజలు డిపో మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు..ఈదర,బొప్పిడివారిపాలెం, కొమ్మవరం గ్రామాలలో ప్రజలకు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముండ్లమూరు మండల ప్రజలకు గుడ్ న్యూస్….
13
Feb