నాగార్జున సాగర్ ప్రధాన కాలువను ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆర్. మురళీనాథ్ రెడ్డి, ఎస్ఈ లక్ష్మీరెడ్డి ఇతర అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ప్రధాన కాలువ 85/3 మైలు నుంచి కురిచేడు, దర్శి మండ లాల పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించారు. ప్రధాన ప్రాంతాల్లో కాలువ స్థితి, నీటి పరిమాణాన్ని పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈఈలు వెంకటరాజు, రామకృష్ణ, డీఈలు, ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. కాగా కురిచేడు జడ్పీటీసీ సభ్యుడు నుసుం వెంకటనాగిరెడ్డి సమ స్యలు పరిష్కరించాలని సీఈకి వినతిపత్రం అందించారు.
సాగర్ అధికారులకు ఒంగోలు చీఫ్ ఇంజనీర్ దిశానిర్దేశం
15
Feb