దర్శి లో ఉధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎపీటీఎఫ్ వినతి

ఉపాధ్యాయులు అపరిష్కృత సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని
ఎపీటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో దర్శి డిప్యూటీ తహసిల్దార్ శ్రీమతి VVL ప్రసన్న కు జిల్లా APTF అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి,మండల శాఖ అధ్యక్షులు చక్రధర్ లు వినతి పత్రం అందించారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుండి తప్పించాలని, రూ. 2500 వర్క్ అడ్జస్ట్మెంటును తప్పించి రెగ్యులర్ ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాలని, ఎపీజీఐ ఎల్ తుది చెల్లింపులు లోన్లు తక్షణమే మంజూరు చెయ్యాలని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం కల్పించటం వంటి 17 దీర్ఘకాలిక సమస్యలను వినతి పత్రంతో విన్నవించారు. కార్యక్రమంలో జిల్లా APTF అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి,మండల శాఖ అధ్యక్షులు చక్రధర్, సబ్ కమిటీ సభ్యులు వేమా రమణయ్య గొర్రెపాటి వేణు సిహెచ్ బసవయ్య ఐవిల్ నారాయణ, భోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి,ముక్కు రఘురాంరెడ్డి రంగారావు, సిహెచ్ వెంకటయ్య, సుబ్బు కృష్ణ, అమరా శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *