దర్శి పట్టణంలో హర హర మహాదేవ స్మరణలతో మారుమోగాయి. దర్శి పట్టణంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి రధోత్సవం సోమవారం కనుల పండువగా వైభవంగా నిర్వహించారు. అశేష భక్త జనం నడుమ స్వామి రథం దేవస్థానం నుంచి గడియారం స్తంభం సెంటర్ మీదుగా నగర పంచాయితీ కార్యాలయం మీదుగా,నారపుశెటి వారి వీధిల గుండా దేవస్థానానికి చేరుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయన సోదరుడు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయితీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా సంఘం నాయకురాలు శిద్దా లక్ష్మీ పద్మావతి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు వేషదారణలతో పాటు, ప్రత్యేకంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేవస్థానం కమిటీ చైర్మన్ నారపుశెట్టి శివప్రసాద్, ధర్మకర్తలు పాల్గొన్నారు. దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.



