నారు నాణ్యంగా ఆరోగ్యంగా పెంచినట్లయితే పైరు బలంగా ఎపుగా పెరుగుతుందని చీడ పీడలను తట్టుకుని మంచి దిగుబడులు వస్తాయని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. తోట వెంగన్నపాలెంలో శుక్రవారం క్షేత్ర పర్యటనలో బాగంగా నారు మడులను పరిశీలించారు. పోషకాల లోపం లేకుండా జింక్, ఐరన్ లతో కూడిన పోషకాలు అందించాలని కోరారు. ఉల్లి కోడు, కాండం తొలిచే పురుగులు ఆశించకుండా 3 జి గుళికలు నారు మడికి 150 గ్రాముల చొప్పున వెయ్యాలని సూచించారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఆశించిన
దిగుబడులు వస్తాయని తెలిపారు.
నారు ఆరోగ్యంగా పెంచాలి
24
Feb