వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తే ప్రజా మన్ననలు –
అద్దంకి వ్యవసాయ సంచాలకులు ధనరాజ్

ప్రతి ఉద్యోగి ఉద్యోగ బాధ్యతలలో అంకితభావంతో పని చేస్తే ప్రజా మన్ననలు పొందుతారని అద్దంకి వ్యవసాయ సంచాలకులు కే ధనరాజు అన్నారు. మండల కేంద్రంలో గల ముండ్లమూరులోని రైతు భరోసా కేంద్రంలో సోమవారం మండల వ్యవసాయ అధికారిగా పని చేస్తూ బదిలీపై తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల వ్యవసాయ అధికారిగా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఏవో జెడ్ శ్రీధర్ బాబు కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధనరాజు మాట్లాడుతూ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తూ ఎన్ని సమస్యలు వచ్చినా తన మీద వేసుకుంటూ తోటి ఉద్యోగులకు సలహాలు ఇస్తూ వ్యవసాయ రైతుల సమస్యలు పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందారని కొనియాడారు. రైతుల సమస్యలను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేశారన్నారు. బదిలీపై వెళ్లిన శ్రీధర్ బాబును పూలమాలతో దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముండ్లమూరు వ్యవసాయ అధికారిని ఎన్ మేరమ్మ, తాళ్లూరు వ్యవసాయ అధికారి బి ప్రసాద్ రావు, అద్దంకి వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకట వెంకటకృష్ణ, వీ ఏ ఏ లు పాలడుగు శేషారావు, జి ప్రదీప్, అనిల్ కుమార్, గిరి ,త్యాగరాజు, బాల వెంకటయ్య, తిప్పేస్వామి, రాము, దయాసాగర్, క్రాంతి,నరేంద్ర ,ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, అంజలి, శోభారాణి, స్వాతి భాయి, శైలజ, నిర్మల, రాధామని, ఎస్ డి ఎ వెంకటరమణ, పేరయ్య చౌదరి, మాలంపాటి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *