మేలైన యాజమాన్య పద్ధతుల పై రైతులతో పోలంబడి కార్యక్రమం నిర్వహన

బొట్లపాలెం గ్రామం లో గురువారం GAP (మేలైన యాజమాన్య పద్ధతులు) రైతులతో పోలంబడి కార్యక్రమం నిర్వహించారు .
కార్యక్రమంలో పర్యావరణ పరిశీలన విశ్లేషణ నిర్వహించడం జరిగింది రైతులను 5 గ్రూపులుగా ఎన్నుకొని పంట దశకు తగ్గట్టు పంటను ఆశించే చీడపీడలను గుర్తించడం జరిగింది. ఉన్నత అధికారులు పలు రకములైన నవీన యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేయడం జరిగింది.కార్యక్రమంలో భాగంగా రైతులకు గ్రూప్ డైనమిక్స్ Pen in the Bottle ఆట నిర్వహించడం జరిగింది. ఈ ఆట ద్వారా వారి యొక్క ఐక్యమత్య, సంకల్ప బలాన్ని మరియు సామూహిక ఆలోచన శక్తినీ పెంపొందించడానికి తోడ్పడుతుంది. కార్యక్రమంలో DRC ఏ డీ ఏ ప్రభాకర్ , దర్శి ఏ డి ఏ డి ఏ నిర్మల , AO(STL) సుచరిత , AO బాలకృష్ణ నాయక్ , దర్శి మండల పరిధిలోని పదిమంది వీ.ఎ.ఎ లు పాల్గొనడం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *