ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామానికి చెందిన ఓలేటి పేతురు కు చెందిన పొగాకు పొలంలో పురికొస తాడులతో కట్టి ఎండబెట్టిన బర్లీ పొగాకు అపహరణపై కేసు నమోదు చేసినట్లు ముండ్లమూరు ఎస్సై ఎల్. సంపత్ కుమార్ గురువారం తెలిపారు. వలేటి పేతురుకు చెందిన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో ఎండబెట్టిన పొగాకు తాడులను ఆపరించుకు వెళ్లారు. సుమారు 90 తాడులు ( 9 క్వింటాళ్లు) పొగాకు అపరించుకుని వెళ్లారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
పొగాకు అపహరణ పై కేసు నమోదు
09
Mar