ముండ్లమూరు మండలంలోని వేంపాడు గ్రామంలో బర్లి పొగాకు రైతులు పొగాకు మాయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేంపాడు గ్రామానికి చెందిన ఎండ్లూరి హరికృష్ణకు చెందిన నాలుగు క్వింటాళ్ల పొగాకు విలువ 50,000 వేలు ఉంటుందని, బోడపాటి వేణు బాబుకు చెందిన మూడు క్వింటాళ్ల పొగాకు విలువ 35000 విలువ ఉంటుందని వారు తెలిపారు. ముండ్లమూరు ఎస్సీ కాలనీకి చెందిన తాతపూడి సుబ్బారావు చెందిన ఐదు క్వింటాళ్ల పొగాకు తన పొలంలో ఎండబెట్టిన ఐదు క్వింటాళ్ల పొగాకును దొంగలు అపహరించుకుపోయారని ఆ పొగాకు విలువ 60,000 వేలు రూపాయల విలువ ఉంటుందని ఆయన కన్నీటి పర్యంతం అయ్యాడు. పొగాకు మండే లో ఎండబెట్టిన పొగాకు తాడులు మాయం అయ్యాయి. వాటి విలువ ఒక లక్ష 45వేలు ఉంటుందని రైతులు తెలిపారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంటను దొంగలు ఆహా అపహరించు కపోవడంతో అయోమయంలో రైతులుఉన్నారు. మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
పొగాకు మాయంపై రైతులు ఆందోళన
10
Mar