రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల పోలింగ్లో ఓటరు గుర్తింపుకార్డు లేని ఓటర్లు.. ప్రత్యామ్నాయంగా పది పత్రాల్లో ఏదైనా చూపొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్కుమార్ మీనా శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కా ర్డ్, పాస్పోర్ట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రైవేటు కంపెనీలు జారీ చేసిన సర్వీసు గుర్తింపుకార్డు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అధికా రిక గుర్తింపు కార్డు, విద్యా సంస్థలు జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డు, విశ్వవిద్యాలయాలు జారీ చేసిన డిగ్రీ/ డిప్లొమా ఒరిజినల్ ధ్రువపత్రం, వికలాంగుల ధ్రువపత్రం, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ జారీ చేసిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల్లో దేన్నయినా చూపొచ్చని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఓటరు గుర్తింపుగా పదింటిలో ఏదైనా చూపొచ్చు
11
Mar