యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఎస్ ఐ ఎల్ సంపత్ కుమార్ సూచించారు. సంకల్పం కార్యక్రమంలో భాగంగా ముండ్లమూరు లోని ఆదర్శ పాఠశాలలో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కే పూర్ణచంద్రరావు అధ్యక్షతన డ్రగ్స్ మత్తు పదార్థాలపై విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మల్లికా గర్గో ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు మీరు ఎంచుకున్న చదువుపై దృష్టి సారించి ఉద్యోగంలో స్థిరపడేంతవరకు విద్యే మీకు దిక్సూచి అన్నారు. మీరు చదువులో రాణించి ఉన్నతస్థితికి చేరినాడే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుందన్నారు. దీంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉంటారన్నారు. వక్రమార్గంలో ఆలోచించి మత్తుకు బానిసై మీ జీవితాలు జైలు పాలు చేసుకోవద్దని సూచించారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ రెడ్డి, సుబ్బారావు, జానకి రామయ్య , జ మలేశ్వరరావు , నరసింహారావు, శ్రీవిద్యా ,లక్ష్మీనారాయణ , సుజాత ,రమ్యశ్రీ , తులసి, వేణుగోపాలరావు , అశ్విని, హరి బాబు , శివ నాగేశ్వరరావు ,గ్రేస్ ఇవాంజలిన్, అనురాధ ,రాఘవరావు , వెంకటేశ్వర్లు, చాంద్ భాష , రామారావు, ఎలీషా, శ్రీనివాసులు, నరసింహా రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
