ముండ్లమూరు మండలంలో పొగాకు అపహరణకు పాల్పడుతున్న నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నట్లు ముండ్లమూరు ఎస్సై ఎల్ సంపత్ కుమార్ తెలిపారు. పసుపుగల్లు గ్రామానికి చెందిన ఎస్సీ రైతు వలేటి పేతురు రెండు రోజుల క్రితం పొలంలో ఏర్పాటు చేసిన 100 పురికొస పొగాకు తాడులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. బాధిత రైతు వలేటి పేతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం తెల్లవారుజామున పులిపాడు సమీపంలో గల రైల్వే బ్రిడ్జి వద్ద ముగ్గురు నిందితులైన.A1 కొమ్ముల చిన్న సుబ్బయ్య.A2 గాలి ముట్టి వెంకట నర్సు, A3 గాలి ముట్టి బాబు వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వీరు పొదిలికి చెందిన వారని , వీరిని దర్శి కోర్టుకు హాజరు పరచడమైనది.
పోలీసు అదుపులో పొగాకు నిందితులు
11
Mar