వైభవంగా ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల – ప్రత్యేక పూజలు చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పలువురు ప్రముఖులు

సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్లను మంగళవారం వైభవంగా నిర్వహిం చారు. తెల్లవారు జామున ఆంజనేయస్వామి వారికి రుద్రాభిషేకం, లక్ష తమలపాకులతో అర్చన చేశారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులకు ప్రత్యేక క్యూలైనులు ఏర్పాటు చేసి దర్శనం కలిగించారు. మహిళలు నైవేద్యాలు సమర్పించారు. పలు స్వచ్ఛం ద సంస్థల ఆధ్వర్యంలో పులిహోర, దద్దోజనం,
పొంగళ్లు, పానకం, వడపప్పు వంటి ఆహార పదా ర్థాలు తయారు చేసి భక్తులకు అందజేశారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో పార్టీలక తీతంగా రెండు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, శాసనసభ్యుడు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్,మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పం చాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్యలు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. పురోహితులు వారిని పూర్ణ కుంభంతో ఆహ్వానంచి ఆశీర్వచనం పలికారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని బూచేపల్లి వెంకాయమ్మ.. శివప్రసాదరెడ్డిలు ప్రారంబించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *