గుంటూరు నగరంలో మార్చి 19న ఆదివారం స్టెప్ ( Students Teachers Educators Parents ) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యుష సుబ్బారావు పర్యవేక్షణలో వక్త శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్టెప్ జిల్లా అధ్యక్షులు ఆలా అనంతరామయ్య, ట్రైనింగ్ కోఆర్డినేటర్ నర్రా రాజశేఖర్ లు తెలిపారు. వేగంగా సాంకేతికపరంగా మారుతున్న ఈ సమాజంలో గొప్ప పబ్లిక్ స్పీకర్ గా తయారై సమాజానికి ఎలా ఉపయోగపడాలి ..అనే అంశాన్ని ముఖ్యంగా తీసుకుని ఉచితంగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లువారు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని తెలియ చేశారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న దలిచిన వారు .. వివరాలకు ఫోన్ నెంబర్ 9703566770 సంప్రదించాలని వారు కోరారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కోరిటపాడు పార్క్ దగ్గర ఉన్న రవీంద్రభారతి స్కూల్ వేదికగా జరుగుతుందని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు ఉత్తమ వక్తలుగా తయారవ్వాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
