ఘనంగా సీతా సమేత కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

ముండ్లమూరు మండలంలోని భీమవరం గ్రామంలో శ్రీ సీత సమేత కోదండ రామస్వామి నవగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా గ్రామస్తులు ఐక్యంగా నిర్మించిన ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నవగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండలంలోని బొప్పుడు వారి పాలెం, ఈదర, వేముల, పూరిమెట్ల, ఉమామహేశ్వరపురం, మారెళ్ళ, మక్కినేని వారి పాలెం, జమ్మలమడక, గ్రామాల నుండి పాల్గొని పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెకు ఆలయ పూజారులు , గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ సూది దేవర అంజయ్య, జడ్పిటిసి తాతపూడి మోజెస్ రత్నం రాజు, వైస్ ఎంపీపీ బంకా రమణమ్మ నాగిరెడ్డి పసుపు గళ్ళు వైస్ సర్పంచ్ బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి, భీమవరం గ్రామ సర్పంచి అనమలమూరి సుజాత వెంకటరావు, మండల యూత్ అధ్యక్షులు ఇ రుగుల కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *