రమణీయం రాముల వారి కళ్యాణం

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో రాములవారి గుడి వద్ద సీతా రాముల కళ్యాణం గురువారం ఘనంగా జరిగింది. కళ్యాణంలో పోలంరెడ్డి రాజమోహనరెడ్డి , గంగవరపు శివారెడ్డి, గుజ్జుల శ్రీనివాసరెడ్డి దంపతులు పీట్లపై కూర్చొనగా ప్రముఖ సిద్దాంతి పురోహితులు కొండూరి ఉమాగౌరీ శంకర శాస్త్రి, ఉద్దండం రమణయ్య ల ఆధ్వర్యంలో కళ్యాణం జరిగింది. కళ్యాణం అనంతరం భక్తులు వడపప్పు , పానకం , పొంగలి , పులిహోర ప్రసాదంగా స్వీకరించారు. సాయంత్రం 8 గంటల నుండి మహిళల ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అద్దంకి సుబ్బారావు, మద్దాలి నాగేశ్వరరావు , గ్రామ పెద్దలు, భక్తుల ఆధ్వర్యంలో జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *