ప్రజలు సీజనల్ వ్యాధు లపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా వైద్యాధికారి జ్ఞానశ్రీ అన్నారు. తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెంలో శనివారం ఆమె పర్యటిం చారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా వైద్యాధికారి జ్ఞానశ్రీ మాట్లాడుతూ ….గ్రామం లో వైరల్ జ్వరాలు మాత్రమే ఉన్నాయని ప్రజలు అధైర్యపడొద్దన్నారు. గ్రామంలో జ్వరం బారిన పడిన ఏడు మందిని కలిసి వారి ఆరోగ్య స్థితిగతు లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో రెండు రోజులుగా వైద్యశిబిరం నిర్వహి స్తున్నట్లు తెలిపారు. కాచి చల్లార్చిన నీటినే తాగాల న్నారు. మురుగునీరు నిల్వ ఉన్న చోట పారిశుద్ద్య కార్యక్రమాలునిర్వహించాలన్నారు. దోమలు ప్రబ లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దగ్గ రలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. జ్వరం రాగానే నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందవచ్చన్నారు. హెచ్ఈఓ చంద్రశేఖరబాబు, సిబ్బంది కృష్ణ, మస్తానమ్మ, సుశీల, సుజాత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

