ముండ్లమూరు మండల పరిధిలోని జమ్మలమడక
గ్రామంలో గుండ్లకమ్మ నది ఒడ్డున శ్రీ దుర్గ చెన్న మలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీచెన్న మల్లేశ్వర సాహిత దుర్గా మాత, మహా గణపతి, సుబ్రహ్మణ్యశ్వర సాహిత పరివార దేవత, జీవ ధ్వజ ప్రతిష్ట మహా కుంబాభిషేకం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ బ్రహ్మ శ్రీ త్రిపురారి భట్ల శ్రీనివాస మూర్తి, ఆయన శిష్య బందం శాస్త్రరోక్తంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టలో జిల్లాపరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి నందిని, కుటుంబ సభ్యులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ ఎమెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి నందిని అన్నదానం నిర్వహించారు దేవాలయం, విగ్రహ మూర్తుల ప్రతిష్ట సందర్భంగా విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలకరించారు. దేవాలయం వద్ద నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.







