విద్యార్థిని విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించాలని ప్రధానోపాధ్యాయురాలు ఎల్ మాధవి లత అన్నారు. ముండ్లమూరు లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని క్రీడా దినోత్సవం గా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. క్రీడలు మానసికో ల్లాసాన్ని పెంచడమే కాకుండా ప్రతిభ ఉన్నవారికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అన్నారు. ధ్యాన్ చందు జీవితంలోని ముఖ్యాంశాలను విద్యార్థులకు వివరించారు. ముందుగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్ కే హజరత్ అలీ, శ్రీనివాసరావు, భారతి ,చక్రపాణి , నరసింహారావు , శ్రీదేవి , భావన్నారాయణ, ఏడుకొండలు , ప్రభాకర్ , శివరామ కోటేశ్వరరావు , ఆంజనేయులు ,ప్రణతి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
