జగనన్న పాలవెల్లువకు రుణాలు -దర్శి పి డి సి సి బ్యాంక్ మేనేజర్ యోగేశ్వరరావు

జగనన్న పాలవెల్లువపథకంలో భాగంగా అమూల్ పాల కేంద్రాలలో మహిళలకు రూ.40 వేల నుండి రూ.2లక్షల వరకు రుణాలు అందజేయడం జరుగుతుందని దర్శి పి డి సి సి బ్యాంక్ మేనేజర్ యోగేశ్వరరావు అన్నారు . ముండ్లమూరు మండలంలోని నూజిల్లపల్లి గ్రామంలో సచివాలయం వద్ద ఆ గ్రామ సర్పంచ్ చొప్పరపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జగనన్న పాల వెల్లువ రుణ మేళ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …మహిళా సంఘాల గ్రూపులలో ఉండి అమూల్ పాల్ కేంద్రాలకు పాలు పోసే రైతులకు వారి స్థాయిని బట్టి రూ. 40 వేల నుండి రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. అందుకోసం అర్హత గల 70 మందిని ఇంటర్వ్యూలు చేసి 80 లక్షలు రుణాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అమూల్ పాల కేంద్రాల ద్వారా మహిళాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ అవకాశాన్ని సంఘాల్లోని మహిళలు సద్విని చేసు కొని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు, పశు వైద్యాధికారిని ఎం విజయలక్ష్మి, వైకెపి ఏపిఎం ఎం హనుమంతరావు , వైద్యాధికారి కాశిరెడ్డి, రూట్ ఆఫీసర్లు మాల కొండయ్య, నాగేశ్వరరావు, సీసీ పి గురవయ్య, సంఘాలలోని మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *