వ్యవహారిక భాషా పితామహునిగా పేరొందిన గిడుగు రామ్మూర్తి తెలుగు భాషకు గొడుగు పట్టారని వక్తలు కొనియాడారు. మండల కేంద్రమైన ముళ్ళమూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం గిడుగు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎల్ మాధవి లత అధ్యక్షతన నిర్వహించిన వేడుకలలో తొలుత గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు భాషా ఉన్నతికి కృషి చేసిన మహనీయుడు రామ్మూర్తి అని అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్ కే హజరత్ అలీ, శ్రీనివాసరావు, భారతి ,చక్రపాణి ,నరసింహారావు ,శ్రీదేవి ,భావన్నారాయణ,ఏడుకొండలు ,ప్రభాకర్ ,శివరామ కోటేశ్వరరావు ,ఆంజనేయులు ,ప్రణతి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
