తెలుగు భాషా దినోత్సవంను సందర్భంగా బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రంజిత్ భాషా ఆధ్వర్యంలో వ్యవహారిక భాషా ఉద్యనేత గిడుగు రామమూర్తి పంతులు 160వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాతృ భాష యొక్క గొప్పతనాన్ని వివరించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని తెలుగు కవులను, తెలుగు అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో బాగంగా రిటైర్డ్ తెలుగు అధ్యాపకులు, చారిత్రిక పరిశోధకులు జ్యోతి చంద్రమౌళిని కలెక్టర్ రంజిత్ భాషా ఘనంగా సన్మానించారు.
