తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగిన తైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీల్లో తాళ్లూరు మండలం నాగం బొట్ల పాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ సోము వీరాంజనేయరెడ్డి (అనిల్ రెడ్డి), వెంకట సుబ్బులు పెద్ద కుమార్తె చరిష్మా పాల్గొని మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. దీంతో వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకు అసోంలోని గౌహతిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికై నది. చరిష్మా ప్రస్తుతం బీటెక్ ద్వితీయ సంవ త్సరం తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సి టీలో చదువుతోంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించిన చరిష్మాకు ఎంపీపీ తాడికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీలు యిడమకంటి వెంకటేశ్వరరెడ్డి, మంచాల ప్రియాంక నాగార్జునరెడ్డి, మాజీ సొసైటీ అధ్య క్షులు పులి ప్రసాదరెడ్డి, శనివారపు శ్రీనివాస రెడ్డి అభినందనలు తెలిపారు.

