దర్శి మండలంలోని సామం తపూడిలో నూతన విగ్రహాల ప్రతిష్ఠా ఉత్స వాలు వైభవంగా జరిగాయి. శ్రీచెన్నమల్లికా ర్జునస్వామి ఆలయంలో శివుని, పార్వతీదే విల విగ్రహలు, చెన్నకేశవస్వామి ఆలయం లో చెన్నకేశవస్వామి విగ్రహం, ధ్వజస్తంభ, శిఖరాల ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. సిద్ధాం తకర్త శ్రీ కారంచేటి దక్షిణామూర్తి ఆధ్వర్యం లో వేదపండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా నిత్యపూజ, గత్త పూజ, రత్నన్యాసం, గాతున్యాసం, యంత్రస్థా పన, బింబప్రతిష్ఠ తదితర పూజా కార్యక్ర మాలు మహాకుంభాబిషేకం చేశారు. వేలాది మంది భక్తులు పాల్గొని పూజలు చేశారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న దాన కార్యక్రమాలు నిర్వహించారు.
*ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి*
ప్రతిష్ఠ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి పాల్గొన్నారు. స్వామి వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కె.వి.రెడ్డి ,కుడి కాలువ ప్రాజెక్టు మాజీ డైరక్టర్ సద్ది పుల్లారెడ్డి, నాయకులు సన్నపురెడ్డి బాలకొండారెడ్డి, ఇరుగుల శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎడమకంటి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


