ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డిని, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డిని గురువారం ఆయన కార్యాలయంలో ముండ్లమూరు వైస్ ఎంపీపీ బంకా రమణమ్మ నాగిరెడ్డి, మండల వైకాపా సీనియర్ నాయకులు పులిపాడు లక్కిరెడ్డి సుబ్బారెడ్డిలు ఒంగోలులో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కి గ్రామంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలో ఆ పనులు పూర్తి చేయిస్తానని ఎం.పి హామీ ఇచ్చారు.
