రైతులు ఖరీఫ్ లో సాగు చేసిన పొలాలలోని పంటలను సర్వే నంబర్ల ఆధారంగా ఈ క్రాఫ్ లో నమోదు చేయాలని డి డి ఏ ఎస్ సి సుబ్రహ్మణ్యం అన్నారు. మండలంలోని శంకరాపురం గ్రామంలో శనివారం పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఏ సర్వే నెంబర్ పొలాలలో ఏ ఏ పంటలు వేశారు వాటి ఆధారంగా సబ్ డివిజన్లోని పంట నమోదు అంశాలను తనిఖీ చేయాలని స్పెషల్ కమిషనర్ అగ్రికల్చర్ వారి ఆదేశాల మేరకు సర్వే నెంబర్లు ఆధారంగా పంట మరియు ఆన్లైన్లో నమోదు చేసిన పంట విస్తీర్ణం నీటి వసతి పై పంట రకములను పరిశీలించారు. ప్రతి రైతు తమ పంటల వివరాలను మీ గ్రామాలలో గల ఆర్బికేల్లో ఈనెల 15వ తేదీ లోపు పంట నమోదు చేయించుకోవాలన్నారు. లేకుంటే 15వ తేదీ తరువాత పంట నమోదు ప్రక్రియ ఆగిపోతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎండి ఫారుక్, వీ ఏ ఏ కృష్ణారెడ్డి, వీఆర్వో బద్రి అయ్యప్ప రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సర్వే నెంబర్లు ఆధారంగా పంటలను నమోదు చేయాలి
02
Sep