కొమ్మ వరంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ – దర్శి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి కుటుంబానికే – వెల్లడించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్

ముండ్లమూరు మండలంలోని ఈదర పంచాయతీ పరిధిలో గల కొమ్మవరం గ్రామంలో పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి, నీలంపాటి అమ్మవారి కి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు మేకల వెంకటేశ్వర రెడ్డి ఆహ్వా నం మేరకు ప్రత్యేక పూజల లో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మకు గ్రామస్తులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ను ఆలయంలో పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పిటిసి తాతపూడి మోజస్ రత్న రాజు, వైస్ ఎంపీపీ బంక రమణమ్మ నాగిరెడ్డి, పసుపుగల్లు మాజీ సర్పంచ్ చింతా శ్రీనివాస్ రెడ్డి. బొప్పూడివారిపాలెం మాజీ సొసైటీ అధ్యక్షులు గాదె నాసర్ రెడ్డి, పసుపు గల్లు ఉపసర్పంచ్ బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి, ఆదర్శ పాఠశాల చైర్మన్ బిజ్జం సుబ్బారెడ్డి, వైకాపా మండల యువ నాయకులు మందలపు అశోక్, మేకల కృష్ణారెడ్డి ఏరువ నాగిరెడ్డి, లక్కు లక్ష్మీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దర్శి ఎమ్మెల్యే టిక్కెట్ బూచేపల్లి కుటుంబానికే ! – జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరుపున బూచేపల్లి కుటుంబానికే అధిష్టానం మూడు రోజుల క్రితం ఖరారు చేసిందని జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. ఈదర పంచాయతీ ఆదివారం ఆంకాలమ్మ గుడి వద్దకార్యక్రమానికి హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడారు. దర్శి వైసిపి టిక్కెట్ కోసం స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ మంత్రి శిద్దారాఘవరావు, బూచేపల్లి కుటుంబం పోటీ పడుతున్నప్పటికి వైసిపి అదిష్టానం నుంచి మూడు రోజుల క్రితం బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేరు ఖరారైందన్నారు. వైసిపి కన్వినర్లను తమకు అనుకూలమైన వారిని నియమించుకోమని దర్శి, కురిచేడు, దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలలో తమకు అనుకూలమైన కార్యకర్తలను నియమించుకోమని అదిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో మండల వైసిపి కన్వినర్ సూదిదేవర అంజయ్య, నాయకులు అబ్బన ఆంజిరెడ్డి, కొండారెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, పి శ్రీనివాసరెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన బూచేపల్లి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *