సర్వే పల్లి ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడు – ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవవేడుకలు

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో సర్వేపల్లి రాధాక్రిష్ణ జయంతి వేడుకలను మండలంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తాళ్లూరులోని ఎబీసీ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాక్రిష్ణ చిత్రపటానికి ఎంఈఓ జి. సుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర్, ఏ బి సి హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, డైరెక్టర్ కాలేషాబాబులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంఈఓ జి సుబ్బయ్య మాట్లాడుతూ… సర్వేపల్లి ప్రతి ఉపాధ్యాయునికి ఆదర్శమని ఆయన జీవిత చరిత్రను గురించి విద్యార్థులకు వివరించారు. ఎంఈఓ – 2 సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతి గురించి నిరంతరం ఉపాధ్యాయులు కృషి చేస్తారని అన్నారు. కరస్పాండెంట్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవటంమే ఉపాధ్యాయులకు ఎంతో ఆనందదాయకమని, అదే వారికి నిజమైన కానుక అని అన్నారు. నిత్యం విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేయటమే ఉపాధ్యాయుల పాత్ర అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడే ప్రతి ఉపాధ్యాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ … నేటి ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యతను చెప్పారు. చదువులంటే కేవలం పుస్తకాలలో పాఠ్యాంశాలను చెప్పటం కాదని, సమాజంలోని మంచి చెడులను విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యతను , విద్యార్థుల కర్తవ్యాన్ని వివరించారు. డైరెక్టర్ కాలేషాబాబు మాట్లాడుతూ అజ్ఞానాన్ని పార ద్రోలి విజ్ఞానాన్ని అందిచే వారు ఉపాధ్యాయులని, ఉపాధ్యాయులు నిత్యం నూతన విద్యార్థి వలే జ్ఞానాన్ని సమపార్జిస్తూ ఉన్న నాడే మంచి ఉపాధ్యాయుడుగా విద్యార్థులకు న్యాయం చెయ్యగలుగుతారని చెప్పారు. అనంతరం ఎంఈఓలను ఘనంగా సన్మానించారు. పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయుల దీవేనలు అందుకున్నారు. ముందుగా ఎంఈఓ జి. సుబ్బయ్యకు, ఎంఈఓ – 2 సుధాకర్కు పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. ముందుగా సర్వేపల్లి రాధాక్రిష్ణ చిత్ర పటానికి, మదర్ తెరిసా వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి కూడా ఘన నివాళి అర్పించారు. మదర్ థెరిస్సా సేవ మూర్తి అని, ఆమె చేసిన సేవలు వివరించారు .కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు (ఎస్.ఏ)లు యలమందారావు, సుబ్బయ్య, చిన్నయ్య, కొండల రావు, వెంకటరావు, స్వరూపరాణి, రాణి, బలరామ్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *