ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురిసి వాతావరణంలో మార్పులు సంభవిస్తున్న కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, జాగ్ర త్తలు తీసుకోవాలని వైద్యురాలు షేక్. ఖాదర్ మస్తాన్ బి సూచించారు. తాళ్లూరు ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మంగళవారం పలువురు అధికారులు, సిబ్బంది, ఆశ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలేందుకు వీల్లేకుండా పరిశుభ్రత కోసం కృషి చేయాలని ఆదేశించారు. దోమల వ్యాప్తికి తావులేకుండా చూడాలన్నారు. రక్తహీనత ఉన్న మహిళలు ఆసుపత్రికి రాలే కుంటే తల్లీబిడ్డ ఎక్సప్రెస్ నువినియోగించుకోవచ్చన్నారు. నేత్రదానంపైనా అవగాహన కల్పించారు. వైద్యులు రాజేష్ యాదవ్, సీహెచ్ ప్రమీలా తదితరులు పాల్గొన్నారు.
