ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరులో గల ఆదర్శ పాఠశాల వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి భార్యాభర్తలకు గాయాలు అయ్యాయి. గుంటూరుకు చెందిన గుంజి శ్రీనివాసరావు జ్యోతి భార్య భర్తలు గుంటూరు నుండి ద్విచక్ర వాహనంపై దర్శి పక్కనే ఉన్న శివరాజు నగర్ లో బంధువుల ఇంటిలో జరుగుతున్న శుభ కార్యక్రమానికి బయలుదేరారు. మార్గమధ్యంలో దర్శి అద్దంకి రహదారిలో ముండ్లమూరు ఆదర్శ పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహనం బోల్తా పడటంతో భార్యాభర్తలు ఇరువురికి గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని ముండ్లమూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి డాక్టర్ ఎం జాస్మిన్, స్టాఫ్ నర్స్ కే మాధవి, ల్యాబ్ టెక్నీషియన్ పి నాగార్జున, ఫార్మసిస్ట్ కే యుగంధర్ ప్రధమ చికిత్స చేసి వారిని పంపించారు.

