జగనన్న పాల వెల్లువ ద్వారా అమూల్ పాల కేంద్రాలకు ఎక్కువ పాలు పోసే విధంగా కృషి చేయాలని ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు అన్నారు. మండలంలోని తమ్మలూరు గ్రామంలో బుధవారం వైకెపి ఎపిఎం ఎం హనుమంతరావు అధ్యక్షతన జగనన్న పాలవెల్లువ పై పాడి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల గ్రూపులలో ఉన్నటువంటి పాడి రైతులకు ప్రభుత్వం పిడిసిసి బ్యాంకుల ద్వారా గేదెకు ఒక లక్ష ఒక 1 వేయ్యి 300 రూపాయలు, ఆవుకు 85 వేల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణం అందిస్తుందన్నారు. ఇలాంటి అవకాశాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. గ్రామంలోని మహిళా సంఘాలు, వివో ఏలు, వాలంటరీలు, పంచాయతీ కార్యదర్శులు పాడి రైతులతో మాట్లాడి పాలు పెంచేందుకు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు కాశిరెడ్డి, విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి సురేష్ రెడ్డి, సీసీ గురవయ్య, పాడి రైతులు పాల్గొన్నారు.
అమూల్ పాల కేంద్రాలకు పాలు పెంచేందుకు కృషి చేయాలి
13
Sep