పీఎం కిసాన్ నిథులకు విడుదలకు ఈ- కెవైసీ తప్పనిసరి చేయించుకోవాలి కేవైసీతో అర్హులకు లబ్ది చేకూరుతుంది.- తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు

పీఎం కిసాన్ నిథులు రైతుల ఖాతాలో జమ కావటానికి తప్పనిసరిగా ఈ- కెవైసీ చేయించుకోవాలని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. తాళ్లూరు మండలంలోని రెడ్డి సాగర్, అయ్యల పాలెంలలో పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో 785 మంది రైతులు ఈ- కెవైసీ చేయించుకోవాలని ఆవరులో 476 మంది వివిధ ప్రాంతాలలో ఉన్నట్లు చెప్పారు. అందులో 309 మంది వేలి ముద్రలు పడని వారు ఉన్నారని చెప్పారు. స్థానిక ఆర్బికేలలో సంప్రదించి ఈ – కెవైసీ చేయించుకోవాలని కోరారు. గ్రామాలలో కూడ క్యాపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విఏఏలు శ్రీను, సుస్మా సుల్తాన్, ఎఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *