చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అంటూ నినదించిన తెలుగు యువత.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అన్యాయం అంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో మంగళవారం ఏడవ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దర్శి మాజీ శాసనసభ్యులు నారపు శెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్యల ఆధ్వర్యంలో దర్శినందు గత వారం రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు ఇచ్చిన పిలుపుమేరకు దర్శి నియోజకవర్గ తెలుగు యువత ఐదు మండలాల అధ్యక్షులు ,తెలుగు యువత నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు మాట్లాడుతూ ……. రాజకీయ కుట్రతో చంద్రబాబును అరెస్టు చేయడం అన్యాయమని, బాబు విడుదల అయ్యేంతవరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని అన్నారు. కార్యక్రమంలో తాళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబులరెడ్డి, దర్శి తెలుగు యువత అధ్యక్షులు చిన్న, వీర నాగిరెడ్డి ,సుబ్బారావు, తెలుగు యువత అధికార ప్రతినిధి బాలకృష్ణ ,గిరి, పేరి రెడ్డి ,ఐదు మండలాల తెలుగు యువత అధ్యక్షులు, తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *