రాష్ట్రం లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు – దేవాలయాల్లో పూజలు చేస్తే కేసులు పెడతారా? – చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన చేస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేస్తారా? – టీడీపీ జిల్లా అధ్యక్షులు, డాక్టర్ నూకసాని బాలాజీ

మాజీ ముఖ్యమంత్రివర్యులు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని వాటిని అడ్డుకుంటూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని జగన్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భాగ్యనగర్ లోని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన కేసు సరైనది కాదని, ఆయన తెలుగువారికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చి పెట్టారని అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఆయన అరెస్టు పట్ల నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని అన్నారు. చంద్రబాబు కోసం ఇసుక దర్శిలో నరసింహ స్వామి దేవాలయం లో దేవాలయాల్లో పూజలు చేసిన వారిపై కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని నూకసాని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒంగోలు అద్దంకి ప్రాంతాల్లో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలను పోలీసులు అక్రమంగా అడ్డుకొని అరెస్టు చేయడం రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను జగన్ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందనటానికి ఉదాహరణ అని నూకసాని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే జగన్ అన్ని రకాల నిరసన దీక్షలు చేసేవారా అని నూకసాని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుపై సాధింపు ధోరణి మంచిది కాదని, నేటికీ ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారని, ఏ విధంగానైనా మనీ లాండరింగ్ జరిగిందా? అంటే లేదనే సమాధానం వస్తోందని అన్నారు. సీమెన్స్ కంపెనీ, డిజైన్ టెక్ ఖర్చు పెట్టిన ప్రతి పైసా యువత శిక్షణకే వినియోగించబడిందని, ఆంధ్ర రాష్ట్ర యువత అభివృద్ధికి చంద్రబాబు పాటుపడ్డారని, వారికి అండగా నిలవాలని ఆయన చేసిన ప్రయత్నానికి అన్యాయంగా ఎటువంటి అవినీతి లేనిదాంట్లో అవినీతిపరుడిగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని నూకసాని అన్నారు. జగన్ అవినీతి పరుడు కాబట్టి చంద్రబాబునాయుడును కూడా అవినీతిపరుడిగా చూపించాలనే దుర్బుద్ధి తప్ప మరొకటి కాదాని, కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటికి వస్తారని డాక్టర్ నూకసాని బాలాజీ ఆశాభావం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా బుధవారం చీమకుర్తి లో బిసి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహారదీక్షలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ పాల్గొని, సంఘీభావం తెలిపి ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *