అంగనవాడి కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా సిఐటియు నాయకులను ముందుస్తూ అరెస్టు చేయడం హేయమైన చర్య అని సిఐటియు మండల కార్యదర్శి బోడపాటి హనుమంతరావు అన్నారు. శనివారం రాత్రి బోడపాటి హనుమంతరావు ను పోలీసులు నోటీసులు జారీ చేసి అరెస్టు చేయడం తగదని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పై పోరాడుతుంటే ఇలా దొడ్డి దారిన అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంట ఏడుకొండలు పాల్గొన్నారు.
