ముండ్లమూరు మండలంలోని తమ్మలూరు గ్రామంలో వినాయక స్వామి భక్తిశ్రద్ధలతో పూజారి దుర్బా కుల నగేష్ శర్మ మంత్రోచ్ఛనులతో పూజలందుకొని తొమ్మిదవరోజు మంగళవారం కావడంతో స్థానిక భక్తులు యువతి యువకులు గణపతి పప్పా మోరియా అనే నామంతో వినాయక స్వామిని ట్రాక్టర్ ఫై ఏర్పాటుచేసి గ్రామంలోని మెయిన్ బజార్ గుండా పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వాల్మీకి సంఘం బిసి లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగనన్న యూత్ ఐక్యంగా యువతీ యువకులు రంగులు గులాములు చల్లుకుంటూ బాణాసంచా కాల్చుతూ డిజె సౌండ్ స్పీకర్ బాక్స్ లు ఏర్పాటు చేసుకొని డాన్సులు వేస్తూ ఆనందోత్సాహాలతో సందడి చేశారు. వినాయకుని వద్ద ఉన్న లడ్డు ప్రసాదాన్ని భక్తులకు పంచి పెట్టారు. వినాయక నిమజ్జనం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయకుడిని కొత్తపట్నం సముద్రంలో నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

