మొక్కల పరిరక్షణతోనే ఆరోగ్యం – తీగల సత్యవతి.ఘనంగా మోదీ జన్మదిన పక్షోత్సవాలు.

  నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భముగా నిర్వహిస్తున్న సేవా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సింగరాయకొండ లోని సోమరాజు పల్లె మండల స్కూల్  ఆవరణంలో మొక్కలు నాటి, పర్యావరణ రక్షణపై అక్కడ ఉన్న పిల్లలకు వివరించారు.   
రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆదేశానుసారం జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి సూచనల మేరకు మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పిలేరు శివ కుమారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ తీగల సత్యవతి తమ పర్యటనలో భాగంగా సింగరాయకొండలో నిర్వహించిన సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు.
   కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు తన్నీరు శ్రీనివాసులు, మండల ఉపాధ్యక్షులు కుంచాల ప్రసాదు, స్కూల్ సిబ్బంది హరి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *