గణనాథుడి ఆశీస్సు లతో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి- జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ,దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు, యువకులు, వ్యవసాయ రైతులు ,కార్మికులు, ఉద్యోగులు సుఖశాంతులతో వర్ధిల్లాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో మాజీ సర్పంచ్ చింతా శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచి బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడి ప్రత్యేక పూజలు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లు మాట్లాడుతూ…. ప్రజలందరూ ఐక్యంగా స్వామివారి పూజలు చేసుకొని ప్రశాంతంగా జీవించాలని కోరారు. స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ఊరు చివర నుండి డప్పు వాయిద్యా లు, మేళ తాళాల మధ్య యువకుల కేరింతల మధ్య, స్వాగతం పలుకుతూ ఊరేగింపుగా పూలు చల్లుతూ అశేష జనవాహిని మధ్య గణనాథుడి విగ్రహం వరకు పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు ఆమెను తీసుకువచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి రాకతో పసుపు గల్లు జనసంద్రంగా మారింది. రావడంతో శివప్రసాద్ రెడ్డి పూజలు అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పూలమాలలతో శాలువాలతో నంగా సత్కరించారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ సూది దేవర అంజయ్య, జడ్పిటిసి తాతపూడి మోజెస్ రత్నం రాజు, వైస్ ఎంపీపీ బంకా రమణమ్మ నాగిరెడ్డి, ఆంజనేయ డైరీ ఎండి ఎనుముల శ్రీనివాసరెడ్డి, వైసిపి మండల యూత్ అధ్యక్షులు మందలపు అశోక్, ఉలగల్లు మాజీ సర్పంచి గొంది వెంకట అప్పారెడ్డి,గూడాల లింగారెడ్డి,ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ బిజ్జం సుబ్బారెడ్డి, ఏరువ నాగిరెడ్డి, గూడాల సుబ్బారెడ్డి, మారెళ్ళసర్పంచి గోపన బోయిన శ్రీనివాసరావు, కైపు వెంకటేశ్వర రెడ్డి, వార్డు మెంబర్ బిజ్జంరమణారెడ్డి, కోట బ్రహ్మారెడ్డి, ఉల్లి హనుమంతరావు, వైకాపా సీనియర్ నాయకులు సోమేపల్లి సుబ్బయ్య, మేడగం రమణారెడ్డి, ఎ ఇడమకంటి పార్వతి, లక్కు కొండమ్మ, మారం ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *