సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం కావాలని కార్యకర్తలకు పిలుపు -మండల ప్రవాస యోజన సమావేశంలో తీగల సత్యవతి.

భారతీయ జనతా పార్టీ మండల ప్రవాస యోజనలో భాగంగా గురువారం ఒంగోలు నగర అధ్యక్షులు డబ్బుకొట్టు మనోజ్ ఆధ్వర్యంలో చంద్రయ్య నగర్ లో జరిగిన సమావేశమునకు మండల ఇన్చార్జి, బిజేపి జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
  
ఈ సందర్భముగా సత్యవతి స్థానిక రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులతో మాట్లాడుతూ రాబోవు సార్వత్రిక ఎన్నికలకు పార్టీ సమాయత్తం కావలసిన తీరును, కార్యకర్తలకు తెలుపవలసిన విధివిధానాలపై చర్చించారు. పలువురి సూచనలను స్వీకరించారు. ముఖ్యంగా మండలంలోని శక్తి కేంద్రాలను, బూత్ కమిటీలను, ఓటర్ లిస్టుల వెరిఫికేషన్ తదితర అంశాలపై నాయకులను అనుసరించిన విధానాలను అడిగి తెలుసుకొన్నారు. ఎన్నిల నెపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మండల అధ్యక్షులు కి తెలియచేశారు.
  
ఈ కార్యక్రమంలో బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర  అధ్యక్షుడు ఖలీఫాతుల్లా భాష, రాష్ట్ర మహిళా నాయకురాలు మీనా కుమారి, జిల్లా నాయకులు కంభంపాటి ఆంజనేయులు, యువమోర్చా నాయకులు సింగోతు రాజేష్ వర్మ, జిల్లా నాయకులు కొమ్ము శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *