ఈ క్రాప్ నమోదు పూర్తి చేయండి – మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు

2023 ఖరీఫ్ లో సాగు చేసిన పంటలకు ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి ప్రసాద్ రావు అన్నారు. తాళ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో ఈ క్రాప్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాలు , పంట నష్ట పరిహారం, ఇన్సూరెన్స్ సదుపాయం తదితర అనేక పథకాల నుండి లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు . ఈ పంట నమోదుకు కార్యక్రమానికి శనివారం చివరి రోజు కావడం ప్రతి ఒక్కరూ ఈ పంట నమోదును చేయించుకోవాలని , ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు. తాళ్లూరు మండలంలో ఇప్పటికే 49 రకాల పంటలకు గాను 7600 ఎకరాల విస్తీర్ణంలో పంట నమోదు చేశామని… ఇంకా ఎవరైనా పంట నమోదు చేయించకుండా మిగిలి ఉన్నట్లయితే ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటల వివరాలను, విస్తీర్ణాన్ని తెలియజేస్తూ గ్రామ రైతు భరోసా కేంద్రాలలో గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు నాగరాజు నాయక్, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *