రాష్ట్ర స్థాయి రగ్బీ జట్టుకు ఎంపిక అయిన బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు అభినందించారు. బొద్దికూరపాడు జెడ్పీ పాఠశాలలో జట్టుకు ఎంపిక అయిన బాలురు కుమార్,శివ రామక్రిష్ణ, బ్రహ్మ తేజ, షేక్ హుస్సేన్ బాష, నంద కిషోర్, హేమంత్, బాలికలు కీర్తన, మూగమణి, కోమలి, హేమలతను ప్రత్యేకంగా అభినందించి ఆదివారం కర్నూల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చాటాలని దీవించారు. ప్రధానోపాధ్యాయులు సీహచ్ సురేష్, సర్పంచి మందా శ్యామ్సన్, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్య, పీఎంసీ చైర్మన్ క్రిష్ణా రెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎస్ అంజి రెడ్డి, రిటైర్డు బ్యాంకు ఉద్యోగి యోగి రెడ్డి, పీడీ రవిప్రసాద్ రెడ్డి తదితరులు క్రీడా కారులకు బెస్ట్ విషేస్ చెప్పిన వారిలో ఉన్నారు.
