తప్పిపోయిన ఓ బాలుడిని వారి కుటుంబసభ్యులకు అప్పగించిన సంఘటన మండలంలోని కురిచేడులో బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని నమశ్శివాయపురం గ్రామానికి చెందిన తిరుప తమ్మ, అంజి దంపతులకు అయిదేళ్ల కుమారుడు వెంకటేష్ ఉన్నాడు. తిరు పతమ్మ, అంజి ఒంగోలులో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. ఈ క్రమంలో బుధవారం నమశ్శివాయపురం గ్రామంలోని బాలుడి అమ్మమ్మ తాటి రవణమ్మ ఇంటి వద్ద వదిలి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో బాలుడు ఆడుకుంటూ బజారుకు వెళ్లాడు. ఎంతసేపటికీ అతడి కోసం ఎవరు రాకపోవడంతో గ్రామస్థులు కురిచేడు స్టేషన్లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ విఘ్నేష్ కు అప్పగించారు. ఆయన వెంటనే పలు సామా జిక మాధ్యమాల్లో ఆ పిల్లవాడు ఫొటోతో సహా వివరాలను పోస్టు చేశాడు. సమాచారంపై స్పందించిన కుటుంబసభ్యులు కురిచేడు స్టేషన్ కు చేరుకుని ఆ బాలుడిని గుర్తించి తీసుకెళ్లారు.
కుటుంబ సభ్యులకు బాలుడి అప్పగింత
05
Oct