ఎరువుల యాజమాన్యం మరియు ఆమ్లా చికిత్స పై రైతులకు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగిందని ఉద్యానవన అధికారి రవి వెంకన్న అన్నారు. మండలంలోని పసుపుగల్లు గ్రామంలో బిందు సేద్యం పరికరాలు, ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎరువులు మరియు యాజమాన్య ఆమ్ల చికిత్సపై గురువారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కరివేపాకు పొలంలో తీసుకోవలసిన వ్యవసాయ పద్ధతుల గురించి వివరించారు.90% రాజకీయ పై సన్న చిన్న కారు రైతులకు బిందు సేద్య పరికరాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ మైక్రో ఇరిగేషన్ అధికారిని అమృత వర్షిని, డిస్టిక్ కో ఆర్డినేటర్ రాంబాబు, కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
