మెప్మా జిల్లా కార్యాలయంలో దివ్యాంగ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా కోరారు. ఈ మేరకు విజయవాడలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి జయలక్ష్మిని సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఇటీవల మార్కాపురం నుంచి పనిపై ఒంగోలు మెప్మా కార్యాలయానికి వచ్చిన ఎలీషాబాబుపై కొందరు దాడి చేశారన్నారు. దీని వెనుక అధికారుల హస్తం ఉందని ఆరోపించారు. దాడి ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయ్యిందని… విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దాడి చేసిన వారిపై చర్యలు కోరుతూ వినతి – సీసీ ఫుటేజీని పరిశీలించి చర్యలు తీసుకోవాలని వినతి -నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా
10
Oct