ప్రతి ఒక్కరూ దేశ భక్తిని పెంపొందించుకో వాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సూచించారు. దర్శి పట్టణంలో బుధవారం నిర్వహించిన అమృత కలశ యాత్రలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు పాల్గొన్నారు. కలశాలను ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. ముందుగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాలను అర్పించారు. ర్యాలీ నిర్వహించారు. గడియారం స్థలం వద్ద ప్రాముఖ్యతను వివరించారు. ఎంపీపీ జి సుధా ఆచ్చారావు, కమిషనర్ మహేశ్వరరావు, ఎంపీడీఓ కుసుమకుమారి, ఈఓఆర్డీ శోభన్ బాబు, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ షకీలా అమీన్ బాషా, జిల్లా ఎంపీటీసీల సంఘ అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, సొసైటీ అధ్య క్షులు వేమిరెడ్డి చెన్నారెడ్డి, వైస్ ఎంపీపీ కొరివి ముసలయ్య, ఎంఈఓ రఘురామయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు కట్టకోట హరీష్ తదితరులు పాల్గొన్నారు.




