దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో నాడు దగ్గుబాటి పురదేశ్వరి కేంద్రంలో మంత్రి పదవి చేపట్టిందని కాని నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆమెపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేయటం తగదని ……భారతీయ జనతాపార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దలూరి ఆంజనేయులు అన్నారు. స్థానిక బీజేపి కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొద్దిలూరి ఆంజనేయులు మాట్లాడుతూ….. బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి పై వైఎస్సార్సీపీ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖడిస్తున్నట్లు తెలిపారు. నిధుల లెక్కలు, మధ్యం విషయం ప్రస్తావించిన రాష్ట్ర అధ్యక్షురాలిపై లేని పోని ఆరోపణలు చేయటం తగదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది దేశంలో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండాలని జన్ ధన్ ఖాతాలను ప్రవేశపెట్టిందని, వాని ద్వారా దేశ ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందారో అందరికీ తెలుసునని, 80 కోట్ల ప్రజలకు విలువైన బియ్యాన్ని దేశ ప్రజలకు ఉచితంగా పంపిణి చేశారు. మోదీ చిత్రం లేకుండా రేషన్ షాపుల ద్వారా పంపిణి చేశారు. ఆంధ్రప్రదేశ్ కి మూడు మెడికల్ కాలేజీలు, మంగళగిరి వద్ద ఎయిమ్స్ ఏర్పాటు, రాష్ట్రంలో 14 లక్షల మంది మహిళలకు మాతృ వందన కింద ఆర్థిక సహాయం, 44 లక్షల మంది రైతులకు 13 వేల కోట్ల రూపాయలు, 4,800 కోట్ల రూపాయలు బీమా యోజన క్రింద పంపిణి, స్వచ్ఛ భారత్ క్రింద 42 లక్షల టాయిలెట్లు, తొమ్మిది లక్షల పక్కా గృహాలు, జల్ జీవన్ మిషన్ క్రింద 67 లక్షల నీటి కుళాయిలు, ముద్ర యోజన కింద 90 వేల కోట్ల రూపాయలతో 77 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 5 లక్షల కోట్లతో ఉజ్వల యోజన, విశ్వకర్మ ద్వారా 13 వేల కోట్ల రూపాయల పథకం ద్వారా దేశ ప్రజలకు ఉపయోగపడే ఎన్నింటినో పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే రాష్ట్రంలో వానిని తమ పేర్లతో, తమ ముఖ్యమంత్రి బొమ్మతో ముద్రించుకొని తమ పథకాల కింద ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సబబు?! వీటికి సజ్జల సమాధానం చెప్పాలని సూటిగా బొద్దులూరి ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాలను వివరించారు. ప్రతిపక్ష పార్టీ నాయకురాలిగా పురదేశ్వరి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించటం ప్రతి బిజేపి కార్యకర్తకు ఆదర్శమని ఆమె నాయకత్వలక్షణాలను కొనియాడారు.
ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్, జిల్లా కార్యదర్శి బసినే పల్లి రాజశేఖర్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పువ్వాడ దామోదర్, స్కిల్ ఇండియా కన్వినర్ పిన్నంటి తిరుమల రావు, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ గుర్రం సత్యనారాయణ, ఓబీసీ మోర్చ ఉపాధ్యక్షుడు వెంకట శివ, కొత్తపట్నం ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, జిల్లా మీడియా కన్వీనర్ రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.
