మార్కెట్ యార్డ్ ద్వారా సేవలందిస్తూ రైతు లకు మేలు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగో పాల్ సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నూతన కమిటీ ఎన్నిక తర్వాత మొదటి సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ…. డైరెక్టర్లు తమ పరిధిలోని గ్రామాలకు మార్కెట్ మార్డ్ ద్వారా అందాల్సిన సేవలు చైర్మన్ సహకారంతో అం దించాలని సూచించారు. కురిచేడు వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ షకీలా అమీన్ బాషా మాట్లాడుతూ ….అందరూ కలిసి కట్టుగా నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ ద్వారా రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం డైరెక్టర్లకు మేమంటో లు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహూకరించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ , పార్టీ మండల కన్వీనర్ వెన్న పూస వెంకటరెడ్డి, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ అంజిరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కండె గంగయ్య, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, దర్శి, ముండ్లమూరు మండలాల సచి వాలయం కన్వీనర్లు బత్తినేని వెంకటేశ్వర్లు, మేడికొం డ జయంతి, ఏఎంసీ సూపర్వైజర్, పి.కపిల్, సెక్ర టరీ మస్తాన్ రావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గాలిమూటి దేవప్రసాద్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కేసనపల్లి నాగేశ్వరరావు, సాంస్కృతిక విభాగం అధ్య క్షుడు షేక్ సైదా, రవి తదితరులు పాల్గొన్నారు.


