కళ…కళ..లాడుతున్న వికె ప్రభుత్వ జూనియర్ కళాశాల -కళాశాలకు పూర్వ విద్యార్థుల సాయం – ముఖద్వారం గేట్, ఆర్చి ఏర్పాటు – నూతనత్వం సంతరించుకున్న కళాశాల – హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ,అధ్యాపకులు

మూడు దశాబ్దాల క్రితం తాము విద్యను అభ్యసించిన పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కృషిచేయడంతో ఆ పాఠశాల, కళాశాల నూతనత్వాన్ని సంతరించుకొనికలకలాడుతుంది. వివరాల్లోకి వెళ్తే … తాళ్లూరు వీకే ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో 10వ తరగతి 1991-1992 బ్యాచ్ విద్యార్థులు జూలైలో సమావేశమ య్యారు.
తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు . అందులో కొందరు పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. కళా శాల ముఖద్వారం గేటు, ఆర్చి ఏర్పా టుకు ఆర్థిక సాయం అందించారు.
పాఠశాలలో కనీస వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నారు. ముఖద్వారము దుస్థితికి చేరడంతో దాన్ని బాగు చేయించాలని, నూతన ముఖద్వారం గేట్, ఆర్చి ఏర్పాటుతో పాటు, కూలిన ప్రహరీని నిర్మించారు. కళాశాల ముందు భాగం కంకరనుతోలి , లైనింగ్లు ఏర్పాటు చేశారు . దానికి తోడు కళాశాలలో నాడు నేడు పనులు కూడా జరుగుతుండడంతో … కళాశాల నూతనత్వాన్ని సంతరించుకున్నది . తాము చదివిన పాఠశాలను గుర్తుంచుకొని, పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన పూర్వ విద్యార్థులను ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *