ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు అండగా జగనన్న సురక్ష పథకం ప్రవేశ పెట్టారని వక్తలు అన్నారు. తాళ్లూరు కస్తూరిభా పాఠశాలలో సోమవారం జగనన్న సురక్ష కార్యక్రమం తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందం పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహారాన్ని ప్రదర్శించి ప్రాముఖ్యతను వివరించారు . జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, సర్పంచిలు వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య, వ్యవసాయాధికారి ప్రసాదరావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి, కస్తూరిభా ప్రన్సిపాల్ సుజిత, కెవీ పాలెం జెసీఎస్ కన్వినర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.






